Home » New Delhi
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.
దేశరాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న డీసీఎం భవంతిలో భారీ అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. భవంతిలోని 9వ అంతస్తులో శనివారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో చుట్టపక్కలంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పదికి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.
సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి చేత భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారంనాడు ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు.
హైదరాబాద్, ఢిల్లీలలో భారీ పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన దోషులకు పదేళ్లు జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెలువరించింది. దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు జైలు శిక్ష పడింది.
మహారాష్ట్ర రాజకీయ వేడి హస్తినకు తాకింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి మహారాష్ట్రలోని అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల చేరిన అజిత్ పవార్ బుధవారం రాత్రి హస్తినకు చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి అజిత్ తీసుకువెళ్లనున్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిన్న మాట అన్నదానికి రెండేళ్లు జైలు శిక్ష ఎలా వేస్తారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ జోడో యాత్రతో మొదలుపెట్టి వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలు తెలుసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని బైక్ మెకానిక్ షాపులను సందర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు కూడా కేటీఎం 390 బైక్ ఉందని చెప్పారు.